హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

SRCL: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్‌కు చెందిన భక్తురాలు జక్కుల రుచిత తన మొదటి జీతం నుంచి రూ.26,730 విరాళంగా అందించారు. తల్లిదండ్రులు రవీందర్, మీనాతో కలిసి ఆలయ ఏఈవో లక్ష్మణరావు, పీఆర్వో పెరిక శ్రీనివాస్‌కు విరాళాన్ని అందజేశారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.