హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు పరీక్షలు

BHPL: పట్టణంలోని ZPHS ప్రభుత్వ పాఠశాలలో రేపు 150 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO లలిత తెలిపారు. అలింకో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల పంపిణీ కోసం పరీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు రెండు ఫొటోలు, వైకల్య ధ్రువపత్రం, ఆధార్, ఆదాయ ధ్రువపత్రం, రేషన్‌కార్డుతో హాజరుకావాలన్నారు.