KMR: బాన్సువాడలో ఆదివారం బారడి పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా వివిధ కుల సంఘాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాత బాన్సువాడకు చెందిన గాండ్ల తేలి కులస్తులు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
బాన్సువాడలో ఘనంగా బోనాల పండగ


