SDPT: చేర్యాల పట్టణంలో ఆదివారం పోచమ్మ, మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు బోనాలతో కుటుంబసమేతంగా కుడి చెరువు వద్దకు చేరుకుని పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు బాగుండాలని ప్రార్థించారు. అనంతరం రాజీవ్‌నగర్ మైసమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు.
తెలంగాణ
చేర్యాలలో ఘనంగా పోచమ్మ బోనాలు


