హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు

KMM: మధిర పట్టణంలో 2 ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు రూ. 47 కోట్ల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు ఆదివారం ప్రకటించారు. సిరిపురం నుంచి మెట్టగుట్ట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 21 కోట్లు, అంబేద్కర్ సెంటర్ నుంచి శివాలయం మీదుగా ఏటి బ్రిడ్జి నిర్మాణంతో మడుపల్లి వరకు రహదారి విస్తరణకు రూ. 26 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.