హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

ADB: ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలోని డైట్ కళాశాలలో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని, గడువులోగా లక్ష్యాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.