హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆల్విన్ కాలనీలో బీఆర్ఎస్ వంటావార్పు

RR: శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీలో బీఆర్ఎస్ నాయకుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. కాంగ్రెస్ రాక్షస పాలన త్వరలోనే అంతమై కేసీఆర్ పాలన వస్తుందని ఆయన అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి హామీలన్నీ అబద్ధాలని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.