హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలి'

ADB: ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు, రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయన్న ఆదివారం ఏఐకేఎంఎస్‌లో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు ఉధృతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.