మహబూబ్ నగర్ పట్టణ పరిధిలోని భూత్పూర్ రోడ్డు శ్రీ లక్ష్మీ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కాలనీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి కాలనీవాసులు వినతిపత్రం సమర్పించారు. కాలనీ సమస్యల పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినట్లు తెలిపారు.
తెలంగాణ
'కాలనీ సమస్యలను పరిష్కరించండి'


