హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బైరు మల్లయ్య ఆరో వర్ధంతి నిర్వహణ'

NLG: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బైరు మల్లయ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను తీవ్రతరం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవనంలో నిర్వహించిన బైరు మల్లయ్య ఆరో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.