JGL: జగిత్యాల మున్సిపాలిటీ 14వ వార్డులో వన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఫిల్టర్ బెడ్ వద్ద రూ.5 లక్షలతో నిర్మించనున్న గ్రీన్ షెడ్‌కు భూమిపూజ చేశారు. రూ.15 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఛైర్మన్ వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్ పాల్గొన్నారు.
తెలంగాణ
వార్డులో మొక్కల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


