హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెలికాం నగర్‌లో దొంగల హల్‌చల్!

KRNL: కర్నూలు నగరంలోని టెలికాం నగర్‌లో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ సృష్టించారు. తాళాలు పగలగొట్టి 3ఇళ్లలో చోరీకి యత్నించగా, స్థానికులు గుర్తించడంతో ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.