SRPT: నడిగూడెం మండలంలోని రైతులంతా సాగు చేస్తున్న పంటల డిజిటల్ నమోదును ఈనెల 10లోగా తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఏఈవో రేణుక సూచించారు. సొంత భూమి అయినా, కౌలు భూమి అయినా పంట వివరాలను యాప్‌లో నమోదు చేయించుకోవాలన్నారు. ఇది ఉంటేనే, కొనుగోలు కేంద్రాల్లో విక్రయదారులు ఇబ్బంది పడకుండా పంటలు అమ్ముకోవచ్చని, ప్రభుత్వ సాయం, భీమాకు ఇది ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
పంట నమోదు తప్పనిసరి: AEO రేణుక


