W.G: మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్‌కు ఆదివారం సెలవుదినం కావడంతో భారీగా పర్యాటకులు తరలివచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన జనం సముద్ర స్నానాలు ఆచరిస్తూ, ఇసుక తిన్నెలపై ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం సమీప ఆలయాలను దర్శించుకున్నారు. మొగల్తూరు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పేరుపాలెం బీచ్‌కు పోటెత్తిన పర్యాటకులు


