హైదరాబాద్: 28°C
వార్తలు

ఈజిప్ట్‌కు చేరుకున్న వాయుసేన 'సారంగ్' టీమ్

ఈజిప్ట్‌లో ఈనెల 8 నుంచి 10 వరకు జరగనున్న ఎల్ అలైమీన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షోలో పాల్గొనేందుకు భారత వాయుసేనకు చెందిన 'సారంగ్' హెలికాప్టర్ బృందం అక్కడికి చేరుకుంది. ప్రపంచంలోనే ఏకైక 5 హెలికాప్టర్ల డిస్‌ప్లే టీమ్‌గా సారంగ్‌కు గుర్తింపు ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ALH ధృవ్ హెలికాప్టర్లతో ఈ బృందం అద్భుతమైన విన్యాసాలు చేయనుందని రక్షణ శాఖ తెలిపింది.