హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూలిన పెంకుటిల్లు.. తప్పిన ప్రమాదం

AKP: కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో ఆదివారం ఉదయం పెంకుటిల్లు కూలిపోయింది. ఆ ఇంటి యజమాని మైలపల్లి సతీష్ కుమార్ కుటుంబంతో ఉపాధి కోసం రాజమండ్రి వెళ్లడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. నిన్న కురిసిన భారీ వర్షానికి ఇళ్లు నానిపోయి కూలిపోయింది. ఇంట్లో వస్తువులు అన్ని ధ్వంసం అయ్యాయి. కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.