ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని ఇమ్మడిచెరువు స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో రాంప్రసాద్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను సిబ్బంది ప్రజలకు అందిస్తున్న ప్రజా సేవలు సిబ్బంది పనితీరును పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఇమ్మడిచెరువులో డిప్యూటీ ఎంపీడీవో తనిఖీ


