హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి

AP: ప్రకాశం(D) సింగరాయకొండ(M) పాకలలో రైతులకు మంత్రి DSBV స్వామి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పబ్లిసిటీ పిచ్చితో జగన్ పాసు పుస్తకాలపై బొమ్మ వేసుకున్నారు. రాజముద్రతో రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. ఎల్‌నినోపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి' అని సూచించారు.