హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మండల సర్వసభ్య సమావేశం

E.G: కోరుకొండ మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 7న సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బి. అశోక్‌కుమార్ తెలిపారు. ఎంపీపీ వుల్లి వీరవెంకట సత్య సూర్యకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.