హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీని ఢీకొట్టిన కారు

ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు ఒంగోలు మార్గాల మధ్య నేషనల్ హైవేపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని 108 అంబులెన్సులో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.