SKLM: ఆమదాలస లోని పూజారిపేటలో చేపడుతున్న డ్రైనేజీ పనులు స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పనుల కారణంగా డ్రైనేజీలోని మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డుపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ పనులతో రోడ్డుపైకి మురుగు నీరు


