హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం

CTR: పుంగనూరు మండలం పరిధిలోని వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించే, విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులతో సోమవారం సమావేశం నిర్వహించనున్నట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు. పుంగనూరు ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి నిర్వాహకులు హాజరు కావాలని ఆయన కోరారు. నిబంధనలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర వాటిపై సూచనలు ఇస్తామన్నారు.