ASR: వినాయక మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ఆన్‌లైన్‌లో పొందాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ganeshutsav.net పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల అనుమతులను సింగిల్ విండో విధానంలో పొందవచ్చన్నారు. దరఖాస్తు ప్రక్రియ ఉచితమని తెలిపారు. నిర్వాహకులు ముందుగానే అనుమతులు పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు'


