హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు దగదర్తి శివాలయంలో ఐశ్వర్య పాశుపత మహా యజ్ఞం

NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఐశ్వర్య పాశుపత మహా యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.