హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవన నిర్మాణాల్లో నిబంధనలు తప్పనిసరి

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఇళ్లు, వాణిజ్య భవనాల నిర్మాణాలు అనుమతులు పొందిన అనంతరం నిబంధనలు, షరతులకు లోబడి మాత్రమే చేపట్టాలని కమిషనర్ మురళీకృష్ణ ప్రకటనలో తెలిపారు. ప్రధాన రహదారులకు ఆనుకుని అక్రమంగా నిర్మించిన షెడ్లు, నిర్మాణాలను యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో మున్సిపల్ నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటామన్నారు.