హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంటలో ఘనంగా వేణుగోపాల స్వామి రథోత్సవం

KNR: కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా జమ్మికుంటలో శనివారం రాత్రి రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారిని రథంపై అధిరోహింపజేశారు. చిన్నారులు, విద్యార్థుల నృత్యాలు, మహిళల కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి. గీతా మందిరం నుంచి గాంధీ చౌక్ మీదుగా రథోత్సవం కొనసాగింది.