హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులు, రైతులకు పొంచి ఉన్న ప్రమాదం

JGL: గొల్లపల్లి (M) రంగధామునిపల్లిలోని కొస్నపల్లి కాళభైరవస్వామి ఆలయానికి వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారింది. ఆలయానికి చేరుకోవాలంటే రిజర్వాయర్ చెరువు కట్టపై నుంచి వెళ్లాల్సి ఉంది. భక్తులు, రైతులు నిత్యం ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. చెరువు కట్టకు రక్షణ గోడ లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పితే చెరువులో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.