హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో వార్డుల పునర్విభజనకు నోటిఫికేషన్

BPT: చీరాల పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 33 వార్డులను 44 వార్డులుగా పునర్విభజించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తయారు చేసిన ప్రతిపాదనలను మునిసిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. వీటిపై పురపాలక ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలని అధికారులు కోరారు.