KRNL: ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో కోసిగిలో వేరుశనగ పశుగ్రాసానికి డిమాండ్ పెరిగి, ట్రాక్టర్ ట్రాలీ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. మేత అందుబాటులో లేక పశువులను పోషించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్కువ ధరకు పశుగ్రాసం అందించాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వేరుశనగ పశుగ్రాసానికి భారీ డిమాండ్!


