హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాకపోకలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై

E.G: రోడ్లపై ఇసుక, ఇటుకలు, రాళ్లు, ఇనుము వంటి సామాగ్రిని గుట్టలుగా ఉంచి రాకపోకలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీతానగరం ఎస్సై ఎల్. శ్రీను నాయక్ హెచ్చరించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల ద్వారా సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించామని తెలిపారు. నాలుగు రోజుల్లో ఆ సామాగ్రిని తొలగించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.