హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు

KDP: యోగి వేమన విశ్వవిద్యాలయం పర్యావరణ శాఖ విభాగాధిపతి, ప్రముఖ శాస్త్రవేత్త, రామన్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత ఆచార్య తుమ్మల చంద్రశేఖర్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య చంద్రశేఖర్‌కు పలువురు అభినందనలు తెలిపారు.