హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టుగూళ్లకు రికార్డు ధర

సత్యసాయి: ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్లో తాజాగా రికార్డు ధర నమోదైంది. కుందుర్పి మండలం యనమలదొడ్డి రైతు గిరీష్ తెచ్చిన పట్టుగూళ్లు కిలో రూ.1001 పలికాయి. 200 కిలోల లాట్‌ను ధర్మవరం రీలర్ కొనుగోలు చేయడంతో రైతుకు రూ. 2,00,200 లభించాయి. ముడిపట్టు ధర రూ.7 వేలు ఉండటం, మార్కెట్‌కు గూళ్ల రాక తగ్గడంతో మంచి ధర వస్తోందని భావిస్తున్నారు.