హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొంగనపాడులో రూ.6.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం

KRNL: కల్లూరు మండలం కొంగనపాడు, చెట్లమల్లాపురం గ్రామాల్లో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం జరిగింది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాల్గొన్నారు. కొంగనపాడులో రూ.6.50 కోట్లతో నూతన బ్రిడ్జికి భూమిపూజ చేశారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.