హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందూపురంలో పోలీసుల విజిబుల్ పోలీసింగ్

సత్యసాయి: హిందూపురంలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే అక్రమ పార్కింగ్, తోపుడు బండ్లను తొలగించారు. రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. వాహన పత్రాలు తనిఖీ చేసి, హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.