హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరులో జాబ్‌మేళా..!

KDP: మైదుకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈనెల 9న ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సురేష్‌కుమార్ తెలిపారు. పది సంస్థలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర విద్యార్హతలు కలిగిన 18 నుంచి 40 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు.