హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సార్ బీసీ కాలువలో పడి యువకుడు మృతి

NDL: బనగానపల్లె పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన చిన్న మద్దిలేటి శనివారం పట్టణ సమీపంలో ఉన్న ఎస్ఆర్బీసీ కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహంపై పడి బోరుమని విలపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.