హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

బాపట్ల పట్టణంలో నూతన విద్యుత్తు లైన్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం రైలుపేటలోని రెల్లికాలనీ ట్రాన్స్‌ఫార్మర్ కింద పనులు జరుగనున్నాయి. దీంతో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాయి శ్రీనివాస్ తెలిపారు. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని, ఆ ప్రాంత ప్రజలు సహకరించాలన్నారు.