ATP: MLA దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను చేనేత కులాల ఐక్యవేదిక ప్రతినిధులు కలిశారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో చేనేత వర్గాలకు కార్పొరేటర్ స్థానాల్లో అవకాశం కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారంతో పాటు స్థానిక సంస్థల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని విన్నవించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి, గుర్తింపునకు ప్రాధాన్యం ఇస్తామని MLA హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చేనేత వర్గాలకు ప్రాధాన్యం ఇస్తాం: ఎమ్మెల్యే


