హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అనకాపల్లి పట్టణంలోని విద్యుత్ సంబంధ పనుల నేపథ్యంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం, బర్మాకాలనీ, శారదాకాలనీ, నెహ్రూచౌక్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. మరమ్మతుల అనంతరం సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.