ASR: సైబర్ నేరాలపై గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు సూచించారు. నిన్న రాత్రి చౌడుపల్లిలో సైబర్ నేరాలు, మహిళల భద్రత, గంజాయి సాగు, రవాణాపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మహిళల భద్రతకు శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నారు. గంజాయి సాగు, రవాణాకు సహకరిస్తే కేసుల్లో చిక్కుకునే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చౌడుపల్లిలో సైబర్ నేరాలపై అవగాహన'


