కృష్ణా: ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మోపిదేవి ఎస్సై పామర్తి గౌతమ్ కుమార్ అన్నారు. మోపిదేవి మండలం పెదప్రోలు పంచాయతీ శివారు కాసానగర్ మలుపు వద్ద ఎస్సై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడప రాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: ఎస్సై


