హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్సై

కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూరు ఎస్సై లక్ష్మీనరసింహ మూర్తి సిబ్బందితో కలిసి వెస్ట్ బైపాస్ అండర్‌పాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని రెండు వాహనాలు, మైనర్ నడుపుతున్న మరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.