హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మచిలీపట్నంలో భారీ వర్షం

కృష్ణా: మచిలీపట్నంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో నగరంలోని పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. మరోవైపు వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. ఖరీఫ్‌ పంటలకు వర్షం కొంత ప్రయోజనం చేకూరుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.