హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం భగ్నం..!

అన్నమయ్య: వెలిగల్లు డ్యామ్ వద్ద తల్లీ, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు యత్నించగా గాలివీడు పోలీసులు సకాలంలో స్పందించి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. కుటుంబ కలహాలతో తీవ్ర నిర్ణయం తీసుకున్న మహిళకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లలతో కలిసి బంధువులకు అప్పగించారు. ఎస్సై నరసింహారెడ్డి, సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.