హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో వైసీపీ సన్నాహక సమావేశం

బాపట్ల వైసీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, చీరాల ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేష్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సంపూర్ణంగా సమాయత్తం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.