హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా శ్రీధర్ నియామకం

VZM: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బూర్లి శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం గజపతినగరంలో శ్రీధర్ కు బీజేపీ గజపతినగరం మండల శాఖ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు శాలువ కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీధర్ గతంలో బీజేపీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇంఛార్జి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు.