హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ

AKP: పాయకరావుపేట మండలం ఈదటం గ్రామంలో శనివారం రైతులకు తహసీల్దార్ మహేశ్వరరావు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. మొత్తం గ్రామంలో 876 పుస్తకాలను రైతులకు అందజేసామన్నారు. ముందుగా గ్రామంలో రీసర్వే నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. పాసు పుస్తకాలకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.