VKB: జిల్లాలో 15 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని జంబాపూర్ గ్రామంలో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, కంది పంటలు వాడిపోతున్నాయని తెలిపారు. వర్షాకాలం మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని అన్నదాతలు కోరుతున్నారు.
తెలంగాణ
వర్షాలు లేక ఎండిపోతున్న పంటలు


