హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ముత్యాలమ్మ జాతరలకు పటిష్ట బందోబస్తు

SRPT: హుజూర్‌నగర్‌లో ఈ నెల 6న పెద్ద ముత్యాలమ్మ, 7న చిన్న ముత్యాలమ్మ జాతరల నేపథ్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ రాజు ఇవ్వాళ తెలిపారు. బందోబస్తులో 4 మంది సీఐలు, 10 మంది ఎస్సైలు, 160 మంది సిబ్బంది పాల్గొంటారు. సీసీ కెమెరాలతో నిఘా, బైపాస్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. ప్రభల ఊరేగింపుల వద్ద ప్రత్యేక భద్రత కల్పించనున్నట్లు సీఐ తెలిపారు.