హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

MDK: జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, మాసాయిపేట, మెదక్, శంకరంపేట మండలాల్లో భూమి సేకరణ చేపట్టాలని సూచించారు. కారిడార్‌తో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.